Mana Desam (1949)
మాట(ఆలోచన) అనేది ఆలోచన చేయుట కొరకు
ఉద్దేశించబడిన అదృశ్య వస్తువు.
నటుడు అనే మాట నటించే వ్యక్తికి ఉద్దేశించబడే మాట.
నటుడి నటన బాగుంది అని నిజ జీవితములో మెచ్చుకుంటాము. అయితే తెర మీద,కేమేరా ముందు మరియు రంగ స్థలము మీద జరిగే నటన నిజ జీవితములోకి నటుడి నటన వచ్చే ప్రమాదము గురించి మాటలాడుకోకపోవడము ప్రభుత్వమును వ్యతిరేకించే ప్రజల(వోటరుల)
అజ్ణానము కాదా?
మాట(డైలాగు) అనేది నమ్ముకోవాలి కాని డబ్బుకు
అమ్ముకుంటానంటే అలాగే అమ్ముకుని అసాంఘికుడిగా
అద్దాల మేడలో జీవించాలి.
అంతే కాని అద్దాల మేడలో జీవిస్తూ మాటలను
నమ్ముకుంటానంటే ఆ అద్దాల మేడ ను కూల్చి అందులో ప్రవేశించి సదరు వ్యక్తితో ఆ మాటల నైతికతను ప్రత్యర్ధులు ప్రశ్నిస్తారు.అది సహజమైన నిజము.అలా కుదరదు
అనటానికి సదరు వ్యక్తికి నైతికత ఏముంటుంది ?
సామాన్య మానవులను విశిష్టులుగా చేసే
భావన,మాట మరియు వ్యక్తీకరణ ల మధ్య ప్రభుత్వము సామాజిక సంక్లిష్టతల నైతిక ప్రక్రియలో భాగముగా
ప్రత్యర్ధులచే కూలగొట్టబడి లోపలికి ప్రవేశించే ఆస్కారము ఉన్న అద్దాల మేడలో జీవిస్తున్నవారు రాజనీతి
నడపరాదు కదా.
సమాజ నైతికతకు వ్యతిరేకముగా కాదని అలా చేస్తే అలాగే దానికి తగిన ఫలితము అనుభవించటానికి సిద్ధము
కావాలి.
చూసే వారున్నారు అని నటన అనే వృత్తి ద్వారా అడ్డ
త్రోవలో రాజకీయ అధికారము అనుభవించాలని
ప్రయత్నించే నటులకు ఇదే నా సమాధానము.
రాజకీయ అధికారము అనేది తనదైన వృత్తి ద్వారా తనకు తానుగా జీవించడము ద్వారా పూర్తి స్థాయి జ్ణానము,
ఓర్పు మరియు ఆలోచన ద్వారా మాత్రమే కలిగే
అవకాశము ఉంది.
అంతే కాని రాజకీయ అధికారము అనేది మీడియా
ప్రచారము ద్వారా అడ్డ త్రోవలో కలిగితే
అదే మీడియా ప్రశ్నలతో అదే అడ్డ త్రోవలో రాజకీయ
అధికారము పోతుంది.
రాజకీయ అధికారము ప్రజాస్వామ్యములో 5
సంవత్సరములు కాలపరిమితి మాత్రమే కలిగి
ఉన్నప్పటికీ భవిష్యత్తులో సదరు రాజకీయ అధికారము అనేది సమీక్షలలో నిలవాలి.
రాజకీయ అధికారము అనేది మాట(ఆలోచన) సక్రమత మరియు నిలకడ మీద ఆధారముగా శాశ్వతమైన
నిజము.
మనిషి మాట అనేది విశ్వాసము మరియు హేతుబద్ధత
అనే రెండు ముఖములు కలిగి ఉంటుంది.
మనిషి మాట అనేది కుక్క మొరుగుడు కాదు.
మనిషి మాటకు మనసు ఉంటుంది.
కుక్క మొరుగుడుకు మనసు ఉండదు.
నటన అనేది కుక్క మొరుగుడు.
మనిషి తనలో తానుగా ఉండటము ద్వారా తనదైన మాట(ఆలోచన) కోసము నిజ జీవితము గడపాలి.
మనిషి సమాజములో సక్రమత కోసము తన నటన
(కుక్క మొరుగుడు) ద్వారా తనయొక్క తానుగా తనలో
జీవించాలి " నిజముగా".
అవును! ఆ మనిషి నిజముగా సంపూర్ణుడు అని తన
వారు అనుకునే విధముగా జీవించాలి కాని ఆ మనిషి అనే వాడు సగము నిజము మరియు సగము నటన(కుక్క మొరుగుడు) అని అనుకునేలా జీవించరాదు నిజజీవితములో.
గుర్తుంచుకోండి! నటన(కుక్క మొరుగుడు) అనేది
నిజముకు మార్గము మాత్రమే గమ్యము కాదు.
తాను నిజము అనేది తన యొక్క తానుగా తనలో
జీవించడము ద్వారా మాత్రమే తన వారికి ఇచ్చే
మాట(ఆలోచన).
కనుక విశ్వాసము మరియు హేతుబద్ధత రెండూ కలిగిఉండి ప్రతి ఒక్కరూ నిజముగా నిలవాలి తన వారిలో.
అంతే కాని నటన(కుక్క మొరుగుడు) ను నమ్మి నాలుగు గోడల మధ్య న్యాయస్థానములో జరిగే వాదనలను
నమ్ముకుంటూ జీవితము 100 సంవత్సరములకు
బదులుగా 200 సంవత్సరములు జీవించినా ఆ జీవితము నిజముగా తన వారిలో తన మాట(ఆలోచన) నిలువదు.
జీవితము అనేది తగు మిత వాదన ద్వారా తన మాట
(ఆలోచన) విడుచుట కొరకు ఉపకరించే ప్రక్రియ అంతే కానీ జీవితము వాదన కొరకు ఉపకరించే ప్రక్రియ కాదు.
కనుక ఇతరులను నమ్మండి.
బుద్ధి విచక్షణ కలిగి ఉండి సమాజములో బరితెగింపు
లేకుండా మనుషులను నమ్మి చెడిపోయిన వాడు భూమి మీద లేడు ఇప్పటి వరకూ.
SO NURTURE FINE DISCRETION.
Comments