మాజీ డిజిపి వి దినేష్ రెడ్డి గారూ ! నేను మీకు ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా రెండు విషయములు అడిగి తెలుసుకుందామనుకుంటున్నాను . 1. ఒక నేరస్తుడిగా/ముద్దాయి గా ఉన్న వ్యక్తిపై చట్ట రీత్యా తీసుకోవలసిన చర్యలను అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఆపే అధికారము కలిగి ఉంటారు ? ఉదాహరణకు ఒక క్రిమినల్ కేసులో ఉన్న ముద్దాయి పై చర్యలను (సదరు ముద్దాయి /క్రిమినల్ కేసు ను రాష్ట్ర ప్రభుత్వము చట్టము ద్వారా కానీ లేదా ప్రభుత్వ నిర్ణయము ద్వారా కానీ "సక్రమత గా నిర్ణయించనంత వరకు") తీసుకోకుండా అధికారములో ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే ఏ అధికారము ప్రకారము పోలీసు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను ఆదేశము ఇవ్వగలరు ? ఒక వేళ ఇఛ్చినా సదరు ఆదేశమును చెల్లని ఆదేశముగా పరిగణించ వలసిన విధి లేదా ? 2. సమాజములో ఉన్న లోపముల కారణముగా మీరు /పోలీసు వ్యవస్థ అనేది పట్టుకోలేకపోవడము /తెలుసుకోలేక పోవడము జరిగింది అని అన్నారు . అంతిమముగా చట్టమును "అమలు చేసే" బాధ్యత /అధికారము కలిగిన మీరు /పోలీసు వ్యవస్థ సమాజములో లోపములను "సరిదిద్ద వలసిన" భాద్యత /అధికారము కలిగి లేదా ?