1. సమాజమును దేవాలయాలకు ఎందుకు ముడి పెట్టాలి ? 2. హిందూ ధర్మములో ఒక సర్వసంగ పరిత్యాగి అయిన వాడు గ్రామ గ్రామానికి తిరిగే పధ్ధతి ప్రాచీనమైనది అని స్వామీజీ చెపుతున్నారు .ప్రాచీనమైనది ఆధునికము గా ఉండాలా అని అందరూ ఆలోచించాలి . 3. దేవాలయానికి వచ్చే వారు తమను తాము అర్పించుకోవడానికి రావాలి అని స్వామీజీ చెపుతున్నారు.మరి స్వామీజీ అందుకు ఏమి కట్టడి చర్యలు తీసుకుంటున్నారో చెప్పటము లేదు . ఎందుకని ? అలా కట్టడి చర్యలు తీసుకుంటే తమ పట్ల హిందూ భక్తులకు గౌరవము -విశ్వాసము తగ్గుతుందని భయమా ? 4. ఎందుకు ఇంటి ముందుకు వచ్చి పాపులారా నిద్ర లేవండి అంటున్నారు ? అని స్వామీజీ ప్రశ్నకు తిరిగి అదే ప్రశ్నను సమాధానముగా స్వామీజీ స్వీకరించరాదు ? 5. హిందువులు మత మార్పిడి చేయాలనుకోరు . మంచిదే . అయితే హిందువుల విభజన మానసికత వలననే బౌద్ధము ,క్రైస్తవము ,ఇస్లాం మతములు పుట్టినాయి అని ఎందుకు హిందూ ధర్మమును నడిపే /రక్షించే స్వామీజీలు విస్మరిస్తారు ? 6. పంచమాంగ దళముగా మతము మార్చుకున్న వార...