This is my order.
ఈ మధ్యన సినిమా హిట్ కావాలంటే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరణ చేసే విధముగా సన్నివేశాలు చిత్రీకరణ చేయడము ద్వారా సక్సెస్ పొందాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు . విపరీత బుద్ధి కి తార్కాణము ఇదే . -------- ఇక విషయానికొస్తే సినిమా మొత్తము అసాంఘికముగా మరియు రాజ్యాంగ వ్యతిరేకముగా "ఉండేట్లు " చేసి సినిమా ఆఖరున సామాజిక సందేశము ఒకటి ఇచ్చేస్తే అది సమాజమును ఉద్దరణ చేసే సినిమా అని దర్శక నిర్మాతలు వాదించుకొని వారే సెన్సార్ బోర్డు వారికి వ్యతిరేకముగా తీర్పు ఇచ్చేసుకోవడము అనేది ప్రజలు వ్యతిరేకించాలి . దర్శక నిర్మాతలూ ! బహిరంగ శృంగారము ,బహిరంగ హింస మరియు బహిరంగ అసాంఘికత అనేవి మూడూ కూడా విపరీత బుద్ధి అని గ్రహించాలి . విపరీత బుద్ధి అనేది ఏ(తక్కువ లేదా మధ్యమ లేదా ఎక్కువ ) స్థాయిలో ఉన్నా అది ఏదో ఒక నాటికి విపరీత బుద్ధిగా నిలుస్తుంది . కనుక ఏదైనా సున్నిత అంశము సమాజమును ఉద్ధరణ చేస్తుందని దర్శక నిర్మాతలు భావించినట్లయితే దానిని అంతర్లీనంగా చూపిస్తూ మరియు చివరన సమాజముకు సందేశము ఇవ్వడము అని సంక్లిష్టముగా సున్నిత అంశమును నేపధ్యమ...