OFFICIALDOM IS RESPONSIBILITY IF VIEWED POSITIVELY. OFFICIALDOM IS AUTHORITY IF VIEWED NEGATIVELY. VIEW OFFICIALDOM WITH NEGATIVE OF POSITIVE SIDE FOR BETTER WORLD. BELIEF IN ARGUMENT IS CRIMINAL. LET'S AVOID IT.
ఇటలీ పెత్తనము లేదా ఢిల్లీ పెత్తనము మనకొద్దు . సరే నలుగురిలో చదవటానికి వినటానికి బాగుంది . నలుగురిని వారి నలుగురు భాద్యత వహించి అడగ వద్దా ? ఢిల్లీ లోని పెద్దలు నలుగురు రెండు(తెలంగాణా మరియు సీమాంధ్ర ) ప్రాంతముల వారికి అధికారము(అంటే భాద్యత ) వహిస్తున్నారు . పై విషయములో సీమాంధ్ర ప్రాంతము వారికి అధికారము అంటే పెత్తనముగా మాత్రమే అనిపిస్తోందా మరి భాద్యతగా అనిపించటము లేదా అని తెలంగాణా లోని నలుగురు సీమాంధ్ర లోని నలుగురిని అడుగుతున్నారు. దానికి సీమాంధ్ర లోని నలుగురు ఏమని సమాధానము చెపుతారు ? అధికారము అంటే ప్రజల సామాజిక -ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచే సాధనము . ఆధికారము అంటే భాద్యత మరియు పెత్తనము . అధికారము అంటే కత్తికి రెండు వైపులా పదును ఉండటము . అధికారములో వున్న వ్యక్తులు -పార్టీ వారు తీసుకున్న నిర్ణయము/లు కొన్ని వర్గాల వారికి తాత్కాలికముగా నష్టము కలిగించే ఆస్కారము వుంటుంది . అది సంక్లిష్ట సమాజములో సహజము . అందుకోసమే అధికారములో వున్న వారు -పార్టీ వారు కమిటీ వేస్తుంటారు . సదరు కమిటీ వారు వారిక...