OFFICIALDOM IS RESPONSIBILITY IF VIEWED POSITIVELY. OFFICIALDOM IS AUTHORITY IF VIEWED NEGATIVELY. VIEW OFFICIALDOM WITH NEGATIVE OF POSITIVE SIDE FOR BETTER WORLD. BELIEF IN ARGUMENT IS CRIMINAL. LET'S AVOID IT.

ఇటలీ పెత్తనము లేదా ఢిల్లీ పెత్తనము మనకొద్దు . 
సరే నలుగురిలో చదవటానికి వినటానికి బాగుంది . 

నలుగురిని వారి నలుగురు భాద్యత వహించి అడగ వద్దా ?

ఢిల్లీ లోని పెద్దలు నలుగురు రెండు(తెలంగాణా మరియు సీమాంధ్ర ) ప్రాంతముల వారికి అధికారము(అంటే భాద్యత ) వహిస్తున్నారు . 

పై విషయములో సీమాంధ్ర ప్రాంతము వారికి అధికారము అంటే పెత్తనముగా మాత్రమే అనిపిస్తోందా మరి భాద్యతగా అనిపించటము లేదా అని తెలంగాణా లోని నలుగురు సీమాంధ్ర లోని నలుగురిని  అడుగుతున్నారు. 
దానికి సీమాంధ్ర లోని నలుగురు ఏమని సమాధానము చెపుతారు ?

అధికారము అంటే ప్రజల సామాజిక -ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచే సాధనము .

ఆధికారము అంటే భాద్యత మరియు పెత్తనము . 

అధికారము అంటే కత్తికి రెండు వైపులా పదును ఉండటము . 

అధికారములో వున్న వ్యక్తులు -పార్టీ వారు తీసుకున్న నిర్ణయము/లు కొన్ని వర్గాల వారికి తాత్కాలికముగా నష్టము కలిగించే ఆస్కారము వుంటుంది . అది సంక్లిష్ట సమాజములో సహజము . 

అందుకోసమే అధికారములో వున్న వారు -పార్టీ వారు కమిటీ వేస్తుంటారు . 

సదరు కమిటీ వారు వారికి అప్పగించిన పనిని చేస్తారు . 

నష్టము కలిగిన వర్గాల వారు అధికారములో(భాద్యత లేదా పెత్తనము లో ) వున్న వ్యక్తులు -పార్టీ వారు తీసుకున్న నిర్ణయముల తాలూకు భయాలు -నష్టాలు -పర్యవసానాలు సవివరముగా సదరు కమిటీ వారితో చర్చించ వచ్చు . సదరు కమిటీ వారు కూడా నష్టము కలిగిన వర్గాల వారితో తమ వివరణ కూడా చర్చించే అవకాశము వుంటుంది . 

ఆ చర్చల ద్వారా ఇరు వర్గాల వారు మనస్సు మార్పు చెందే అవకాశము ఏర్పడి ఇరు వర్గాల వారికి ఆమోదయోగ్యమైన కొత్త నిర్ణయములు-ప్రతిపాదనలు అధికారము(భాద్యత లేదా పెత్తనము )లో వున్న వారికి ఉపయోగ పడ వచ్చు . 

కమిటీ చర్చలు ఎన్ని సార్లైనా జరగవచ్చు . 
లేదా ప్రభుత్వము(అధికారములో వున్న పార్టీ వారు )  ఎన్ని కమిటీ లు అయినా ఏర్పాటు చేయ వచ్చు .

అది అధికార కార్యక్రమములో భాగము . 

అధికార కార్య క్రమాలు నిరంతర ప్రక్రియ .

థర్డ్ పార్టీ కత్తికి రెండు వైపుల పదునే . 
ఎందుకంటే థర్డ్ పార్టీ(కమిటీ )  అధికార పార్టీ నిర్ణయములు ఆమోదించ వచ్చు . లేదా భాదిత పార్టీ ప్రతిపాదనలు ఆమోదించ వచ్చు . లేదా కమిటీ కి అధికారము ఇవ్వబడితే తన స్వంత నిర్ణయములు -ప్రతిపాదనలు ప్రకటించ వచ్చు . 

అధికార(భాద్యత లేదా పెత్తనము ) పార్టీ థర్డ్ పార్టీ ని ఏర్పాటు చేసిన తరువాత తన కత్తి కి వున్న రెండు వైపుల పదును ను థర్డ్ పార్టీ కి ధఖలు పరచినట్లే కదా !

ఇంత అధికార యంత్రాగము ప్రతిరోజు ప్రభుత్వములో నడుస్తూ నిర్ణయములు మరియు వాటి అమలు -పర్యవేక్షణ జరుగుతూ వుంటుంది   
    
  
    

Comments