నేనే భారతదేశ ప్రధానమంత్రిని అయితే మొట్టమొదటి రోజున నేను చేసే నిర్ణయాలు 1."పోలీసు మరియు ఆడిటర్ వారిచే" అందరి ప్రజల ఆదాయ వ్యయ వివరాలు రెగ్యులర్ గా ప్రభుత్వ శాఖలకు అందేలా చర్యలు చేపట్టి నల్లధనము మరియు దొంగ నోట్ల చెలామణీ లేకుండా చేసి తద్వారా కూరగాయలు,బియ్యము,గోధుమలు మరియు కిరాణా సరుకులు రిటైల్ రేట్లు తగ్గిస్తాను.2. స్థానిక సంస్థలచే "నాణ్యమైన" త్రాగునీటిని అందించి మినరల్ వాటర్ వ్యాపారమును నిర్మూలన చేస్తాను.3.ఇంటర్నెట్ రేట్లు బాగా తగ్గించి వాటికి ప్రత్యామ్నాయముగా పెట్రోల్ -డీసెల్ రేట్లు బాగా(నెలకు మూడు రూపాయలు చొప్పున ) పెంచి రైలు మార్గము ఉన్న చోట రోడ్ ప్రయాణమునకు టోల్ టాక్స్ బాగా(నెలకు 300% చొప్పున ) పెంచుతాను.4. భారతీయ వివాహ సంస్కృతిలో ఆడంబరము-అలంకరణ-షోకు నిర్మూలన చేసే చర్యలు(భారతీయ వివాహ సంస్కృతిపై నిజము లేని ఊహా -వాదన మాటలు రాసే రచయితల మీద పెనాల్టీలు,ఆడంబరము -అలంకరణ -షోకు వస్తువులపై మరియు వాడే వ్యక్తులపై 300% పన్నులు) చేపట్టి అనామకత్వమును మరియు ఇన్ఫీరియారిటీ -సుపీరియారిటీ కాంప్లెక్స్ ను నిర్మూలన చేస్తాను. ...