ఓ స్త్రీ ! నీవు నీ స్త్రీత్వముతో నీ పురుషుడిని సమాజములో పురుషుడిగా నిలుపటమే నీ స్త్రీత్వములో నిజమైన పురుషత్వము గా జీవించుట . స్త్రీవి అయిన నీవు నీ పురుషుడికి పురుషుడిగా మారి నటన చేయాలనుకుంటున్నది నీవు కాదా ! అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను . నీ పురుషుడిని పురుషుడిగా చేయగలిగితేనే నీవు సమాజములో ఇతర పురుషులతో నీవు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటావు - కలిగి ఉండగలవు - ఎందుకు కలిగి ఉండలేవు ? ఇంటినుండి సమాజము ఏర్పడలేదు .సమాజము నుండి ఇల్లు ఏర్పడింది కనుక కేవలము నీవు నీ పురుషుడి మీద ఆధిపత్యము కలిగి ఉన్నంత మాత్రాన సమాజములో ఇతర పురుషుల మీద నీవు ఆధిపత్యము ఎలా పొందగలవు ? నీవు మానసికపరమైన మూడు(నీవు ,నేను మరియు అతడు ) కోణములలో ఆధిపత్యము కలిగి ఉండాలంటే నీ పురుషుడు సమాజములో పురుషుడిగా నీవు ఉంచలేనప్పుడు లేదా నీ పురుషుడు తనకు తాను పురుషుడిగా ఉండలేనప్పుడు నీవు నీ పురుషుడికి పురుషుడిగా ఉండి ఆ అవసరత తీరిన తరువాత నీవు నీ స్త్రీత్వములో పురుషుడిగా సమాజములో నిలిస్తే అంతకు మించిన ఆధిపత్యము మరియు సమానత్వము ప్రపంచములో లేదు . ఆలోచించండి .