అమ్మా ! రంగనాయకమ్మ గారూ ! "ఓ స్త్రీ ! పది మంది మగ పిల్లలని కను" అని వేదము చెప్పింది అంటే దాని అర్ధము ఆడ పిల్లలు కనవద్దు అని కాదు . దాని అంతరార్ధము ఏమంటే పుట్టిన వారు పది మందీ ఆడపిల్లలు అయినా కూడా మగ పిల్లలు అంతటి సముద్ర లోతు కలిగిన వారుగా ఉండాలి అని కంపారిజన్ చేసినట్లు . ఇక దేవతలు ,పూజలు ,ధనము మరియు బంగారము గురించి వేదములో ప్రస్తావన గురించి చెప్పాలంటే దేవత అనగా దివ్యత్వము కలిగినది అని అర్ధము . ప్రతి అంశము యొక్క వర్గములో కూడా దివ్యత్వము కలిగినది తప్పక ఉంటుంది . దానిని దేవత అంటారు . పూజలు అనేవి దివ్యత్వము ద్వారా దివ్యత్వము పొందుట కొరకు . ధనము అనేది తన నామ సహిత సామాజిక భావన అని అర్ధము . బంగారము అనేది రిజర్వ్ బ్యాంక్ వారికి ఆర్ధిక ప్రామాణికము అని అర్ధము . -------- ప్రపంచము అంటేనే సంతతి ,దేవత ల ప్రస్తావన ,పూజలు, ధనము మరియు బంగారము అని అర్ధము . మరి ఇక వేదములో వాటి గురించి కాకుండా వేటి గురించి ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉంటుంది ?