Union minister M.venkaiah naidu must face "political death" with silence.
అవును ! ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! అప్పుడు పార్లమెంటు వెలుపల " అప్పటి పార్లమెంటులో జరపవలసిన ఏపీ పునర్విభజన చట్టం గురించిన చర్చ - ఆమోదం గురించి " బాగా
వివరించారు .
సరే ! అయితే ప్రస్తుతము రెండేళ్లు గడిచిపోయాయి .
ఈ రెండేళ్లలో పాలనాపరమైన చర్యలు గురించి కూడా బాగా వివరించారు .
సరే .
అయితే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిగతా రాష్ట్రాల ప్రజలకు మించి "పాలనాపరమైన విధానాలు
మరియు శాసనపరమైన విధానాలు కన్నా
రాజకీయ పరమైన విధానాలు గురించి " అడుగుతారని మీకు తెలియదా !
కేవలము పాలనా పరమైన మేలు మరియు శాసనపరమైన మేలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మొదటి నుండీ మాట నిలకడతో ఒక రాజకీయ వేత్తగా కోరుకుని ఉంటే భారత జాతీయ కాంగ్రెసు అధిష్టానము,అప్పటి కాంగ్రెసు కేంద్ర మంత్రులు మరియు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని విమర్శించదు .
అయితే మీరు ఒక అవకాశ వాద రాజకీయ వేత్తగా అప్పుడు వ్యవహరించారు కనుక ఇప్పుడు అదే అవకాశవాదముతో ఇతర రాజకీయ వేత్తలు
మిమ్మల్ని ప్రత్యేక హోదా గురించి రాజకీయముగా విమర్శ చేస్తున్నారు .
వారి తప్పేమిటి ?
ఒక రాజకీయ వేత్త రాజకీయాలు చేసేటప్పుడు పాలనాపరమైన విధానాలు మరియు శాసన పరమైన
విధానాలు గురించి విధేయత కలిగి ఉండాలి కదా !
అది మీకు లేదు .
కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు మరియు పత్రికలు ప్రస్తుతము మిమ్మల్ని రాజకీయపరముగా తప్పుపడుతున్నాయి . అందులో తప్పేముంది .
-------------
అయితే ఇక ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతము మంచిదా కాదా అన్నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడగటము లేదు . అయితే ప్రత్యేక హోదా గురించి మాటలాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులను ఆంద్ర ప్రదేశ్ ప్రజలు రాజకీయ పరముగా ప్రశ్నిస్తున్నారు .
ప్రత్యేక హోదా గురించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశ్న అనేది ప్రస్తుత కేంద్ర నాయకులకు రాజకీయపరమైన ప్రశ్న
మాత్రమే అని ఎం వెంకయ్య నాయుడు గారు గ్రహించాలి .
ఆంద్ర ప్రదేశ్ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వమును కూడా ఎన్నుకున్నారు . కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర
ప్రభుత్వ పాలనాపరమైన విధానాలు మరియు శాసనపరమైన విధానాలు గౌరవించి మాటలాడుతున్నట్లే
Comments