Missamma Movie || Raavoyi Chandamaama Video Song || NTR, ANR, SVR, Savit...
దర్శకుడు తన వస్తువు అయిన కథ(పాత్రల ఔచిత్యము
అయిన ఆహార్యము-వాచకము-గాంభీర్యమును
వీడకుండా పాత్రల సంభాషణల మరియు
పాటల చరణముల)లో అన్ని వర్గాల ప్రేక్షకులను లీనము అయ్యేట్లు చేయడము ద్వారా తమ జీవితాలలో
ఆ మాటలను అన్వయించుకునేట్లు చూస్తాడు.
ఉదాహరణకు పై పాట చరణములలో ....
--------------------------------------------------
అతడు : తన మతమేదో తనది;మన మతము అసలే
పడదోయ్;
ఆమె : నాతో తగవులు పడుటే అతనికి ముచ్చట
లేవోయ్; ........ఉంది కదా.
-------------------------------------------------
సదరు చరణములలో
వ్యక్తిగతముగా ఎంత మాటకారితనము మరియు
మానసికముగా ఎంత ఆలోచన ఉందో
సామాజికముగా అంతే సార్వజనీనత ఉంది కదా.
-----------------------------------------------------
అది రచయిత గొప్పదనము కాదు.
ప్రతి వ్యక్తి ప్రతి మాటలో సార్వజనీనత చూడవచ్చు.
-----------------------------------------------------
అలా ప్రతి మాటలో ప్రతి మనిషి సార్వజనీనత
చూడగలుగుతున్నప్పుడు సమాజము
(జ్ణానము) తన సంక్లిష్టతలను తొలగించుకొని సత్యవంతము ఎందుకు కాదు? అని నా ప్రశ్న.
--------------------------------------------------
గొప్పదనము అనేది రచయిత,కథ,దర్శకుడు మరియు నటీనటులలో లేదు.
గొప్పదనము ప్రేక్షకులను లీనము చేయడములో ఉంది.
---------------------------------------------------
లీనము చేయగలిగే శక్తి అనేది వస్తువులో ఉంటే
లీనము ఎందుకు కారు?
ఎందుకు సార్వజనీనత పొందలేరు ?
మనుషులు జడపదార్ధములు కాదు కదా.
----------------------------------------------------
Comments