Weaken party line for better world socio-economics. This is my public order to election commission,all Indian voters,all political parties,all party presidents.and all sitting law-makers.

ఎన్నికైన ప్రజా ప్రతినిధి పార్టీ చేత అంతిమము గా ఎన్నిక కాబడలేదు కదా !
మరి అటువంటప్పుడు "ప్రస్తుత సమాచార యుగపు పరిపక్వ ప్రజాస్వామ్య వ్యవస్థలో " ఎన్నికైన ప్రజా ప్రతినిధి అయిదేళ్ళ పాటు కట్టుబానిస లాగా విధేయత కలిగి ఉండటము అనైతికత కాదా ?
ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా పబ్లిక్ ఎక్జిక్యూటివుల మీద ఉండవలసిన ఎక్స్ ఆఫిషియో కార్య నిర్వహణా దికారులు కాదా ?
ఎన్నికైన ప్రజా ప్రతినిధికి "బుద్ధి విచక్షణ లేని పార్టీకి కట్టుబానిసత్వము " ప్రజాస్వామ్య యుతమా ?
      పార్టీ అనేది తల్లి వంటిది . అంటే తండ్రి కాదు . మరి తండ్రి అనేది సామాజిక "ప్రజా - ప్రభుత్వ" వ్యవస్థ అవుతుంది కదా !
"మానసికముగా ఎదిగిన" బిడ్డలు(ప్రజాప్రతినిధులు ) అనబడే వారు తమ తల్లి తమ తండ్రిని బ్లాక్ మెయిల్ చేస్తూ  ఉంటే కట్టుబానిసలుగా అయిదేళ్ళ పాటు భరించాలా ?
    హు ! మీడియా వారు ప్రజా ప్రతినిధిని ప్రతి రోజూ ప్రశ్నిస్తూ   వారి పార్టీకి ప్రజాప్రతినిధుల అయిదేళ్ళ కట్టు బానిసత్వము గురించి కప్పదాటు ధోరణి ఎంత సమంజసము ?
   తల్లికి తండ్రికి ఒకరికొకరు సమానముగా జీవించాలి కాని వారి ఎదిగిన బిడ్డల దృష్టిలో కూడా తండ్రి తల్లి ముందు తల వంచటము అనేది ఆడంగి తనము కాదా ?
   రెండు(తల్లి) అనేది ఒకటి(ఎదిగిన బిడ్డ)కి ఏ విధముగా " తరువాతి ప్రాదాన్యతాక్రమమో"  అలాగే మూడు (తండ్రి ) అనేది రెండు (తల్లి ) ఆ విధముగానే "తరువాతి ప్రాధాన్యతా క్రమమే " అని తల్లి (ప్రతి ఒక్క  పార్టీ అధినాయకత్వము ) కూడా  గుర్తుంచుకునేలా ఎన్నికల సంఘము తన సంస్కరణలు చేయాలి .
   లేనిచో ప్రజల మధ్యన ఉంటూ మీడియా చేతిలో మరియు / లేదా  పార్టీ అధినాయకత్వము చేతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అయిదేళ్ళ పాటు ఈ సమాచార యుగపు ప్రస్తుత
సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థలో  తమ భావ స్వేచ్చను తాకట్టు పెట్టవలసినదే కదా ! ఆలోచించండి!
   పార్టీ విభజన రేఖ అనేది ప్రతి దినమూ మారుతున్న ప్రపంచములో "పరిపక్వ సామాజిక ప్రభుత్వ వ్యవస్థను" బలహీన పరచరాదు కదా !
    అంటే పార్టీ విభజన రేఖ అనేది ఈ సమాచార యుగపు పరిపక్వ సామాజిక ప్రభుత్వ వ్యవస్థలో "దొంగ"
లేదా "హంతకుడు " లేదా "అసాంఘికుడు " లేదా "అజ్ఞానము " అని నా  ఈ సామాజిక విశ్లేషణలో తేలింది కదా !


  

Comments