అవును ! సెక్షను 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టము ప్రకారము హైదరాబాదు ఉమ్మడి రాజధాని కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాదులో జేబులు కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రపంచీకరణ సమాజములో ఇంకా పోలీసు వారు పోలీసుస్టేషను పరిధి గురించి మాటలాడుతున్నారంటే పోలీసు వారిని మించిన నేరస్తులు లేరన్న మాట. నేరము అనేది పోలీసు చేసినా లేక ముఖ్యమంత్రి చేసినా లేక ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ చేసినా అది నేరమే ! .

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 
నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో 
కష్టపడుతున్నాడు కనుక ఆయన గారు హైదరాబాదులో చట్ట విరుద్ధ కార్యములు అంటే జేబులు కొడుతున్నా 
తెలంగాణా పోలీసులు  అరెస్ట్ వారెంట్ జారీ చేయరాదు.

Comments