Just by threatening to sue defamation case, one can't win case. One has to prove that he/she has name and fame for self "against adverse questions". Those who have reputation beyond doubt can file defamation case. Pl.note.
చాలా టెక్నీకల్ మరియు లీగల్ అంశాలు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు
లేవనెత్తారు.
అయితే నేను కొన్ని వివరణలు ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారిని అడగదలిచాను .
1. ఒక కౌన్సిల్ /అసోసియేషన్ అనేది సమాజములో ఒక వృత్తి /వ్యాపారము వారికి ఎందుకు ఏర్పాటు చేసుకోవలసిన అవసరత ఏర్పడుతుంది ?
2. అలా ఏర్పాటు చేసుకోబడిన కౌన్సిల్ /అసోసియేషన్ అనేది తమ సభ్యులపై "ఎవరిపైన అయినా సరే" మీడియా లో ఎవరైనా (సభ్యుడైనా / బయటి వారైనా ) ఆరోపణలు చేస్తే అంతర్గత విచారణ చేసుకునే విధి
మరియు దానిపై చర్యల గురించి మీడియా ద్వారా ప్రజలకు వివరణ ఇవ్వవలసిన విధి ఉంది అని తెలుసా ? లేనిచో సదరు కౌన్సిల్ /అసోసియేషన్ అనేది అండర్ వరల్డ్ మాఫియా అని పిలువబడుతుంది అని తెలుసా ?
3. మీడియా అనేది ప్రజలకు బాధ్యత వహిస్తుంది కానీ ప్రశ్నలను అడిగే వారికి /చెప్పే వారికి బాధ్యత వహించదు అని కౌన్సిల్ వారికి తెలియదా ?
4. ఇక కౌన్సిల్ /అసోసియేషన్ రూల్స్ /బైలాస్ అనేవి పోలీసు వారి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కు లోబడి ఉండాలి అని తెలుసా ? లేనిచో అండర్ వరల్డ్ మాఫియా అంటారు అని కౌన్సిల్ రూల్స్ /బైలాస్ తయారు /సవరణ చేసుకుంటున్నప్పుడు తెలియకపోవటము అనేది చట్ట వ్యతిరేక కార్య కలాపము అని తెలియదా ?
5. దొంగలు /హంతకులు /రౌడీలు కూడా కౌన్సిళ్లు /అసోసియేషనులు .మరియు వాటికి రూల్స్ /బైలాస్ ఏర్పాటు చేసుకుని గుంపు మానసికత అనేది కలిగి ఉంటే వాటికి పరువు ఉంటుందా ?
పరువు లేని కౌన్సిల్ మరియు /లేదా
అందులో రూల్స్ /బైలాస్ ప్రకారము నడుచుకునే సభ్యుడు ఎవరికైనా "పరువు " లేనప్పుడు "పరువు నష్టం " కేసు వేసే హక్కు ఎలా కలిగి ఉంటారు ?
5. సమాజములో ప్రతి వృత్తి /వ్యాపారము వారి కౌన్సిల్ /అసోసియేషన్ వారు ముఖ్యముగా గ్రహించవలసినది ఏమంటే సమాజములో ఎవరైనా ప్రజాస్వామ్య బద్ధముగా ప్రశించే హక్కు ను ఏ కౌన్సిల్ /అసోసియేషన్ వారు ప్రశ్నించరాదు . మొదట సమాజములో సభ్యుడు అయిన తరువాతనే ఏ కౌన్సిల్ /అసోసియేషన్ సభ్యత్వము అనేది చెల్లుబాటు అవుతుంది అని గ్రహించి కౌన్సిల్ /అసోసియేషన్ అనే సంస్థ కు పరువు నష్టము అనేది సమాజము నష్టముకు లోబడి ఉంటుంది తెలుసుకోవాలి . మరియు ఆ విధముగా ఇకనుండైనా ప్రజాస్వామ్య బద్ధముగా బైలాస్ తయారు చేసుకోవాలి .
6. సినిమా ఇండస్ట్రీ లో / ఇండస్ట్రీ వారిలో ప్రజాస్వామ్యము అంటే తెలియదు ప్రజలందరికీ /ప్రేక్షకులందరికీ తెలుసు .
7. సినిమా ఇండస్ట్రీ లో ప్రజాస్వామ్యము అనేది ఉంటే చాలా మంది కొత్త వారికి అవకాశములు ప్రతి సంవత్సరము దొరుకుతూ ఉండి సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండేది . కనుక ఇకనైనా సామ్రాజ్య వాదతత్వము నుండి సినిమా ఇండస్ట్రీ బయట పడాలి .
Comments