బహిరంగ రోడ్ల మీద మరియు వేదికల మీద ఆత్మ జ్ఞాన భోధ అనేది ప్రభుత్వముకు వ్యతిరేకముగా విష ప్రయోగము క్రిందకు వస్తుంది . ఆ విష ప్రయోగము ప్రభావము వలన వోటరు అనే వాడు ప్రజాస్వామ్యములో రాజకీయాల పట్ల అధ్యయనము మానివేసి రాజకీయాల పట్ల సాధన చేయడము మొదలు పెట్టాడు . అధ్యయనము కు సాధనకు చాలా తేడా ఉంది . అధ్యయనము అంటే తెలుసుకొనుట /చదివి ఆలోచించుట . సాధన అంటే భావ ప్రకటన చేయుట . వోటరు అధ్యయనము చేయాలి . నాయకుడు నైతికత గురించి సాధన చేయాలి . వోటరుకు మరియు నాయకుడికి మధ్య చాలా తేడా ఉంది . వోటరు తన రాజకీయాల పట్ల భాద్యత కలిగి ఉండడు . నాయకుడు తన రాజకీయాల పట్ల భాద్యత కలిగి ఉంటాడు -కలిగి ఉండాలి -ఎందుకు కలిగి ఉండడు ? అదీ తేడా ! కనుక వోటరు ఆత్మ జ్ఞానము కలిగి ఉండి ప్రవర్తిస్తే నాయకుడు ఆత్మ జ్ఞానము కలిగి ప్రవర్తించే అవకాశము ఉంటుంది . అలా రాజకీయాలు తీవ్ర వాదము ,అవినీతి మరియు అసంధిగ్ధత లను తమంతట తామే నిర్మూలన చేసుకుని ప్రక్షాళన అవుతాయి .