మతము అనేది ఆసరా. ఆసరా లేనిదే జీవము ఉండదు-ఉండలేదు-ఎలా ఉండగలదు? మత రాహిత్యము మరియు మత మూఢత్వము రెండూ నేరమే. దరిద్రముకు దరిద్రముగా ఉంటే దరిద్రము నిర్మూలన జరుగును. లేమి మరియు అత్యాశ రెండూ దుఖదాయకమే. కొంత కలిగించుకుని ఆ కొంతలో తాను కొంతగా ఉంటే అంతా కలుగును. సంపద అనేది బయట నుండి కలుగదు. సంపద అనేది అంచులోనుండి చూస్తూ దాని అంచును అనగా 'లోపలలో లోపలగా ఉంటే అంతా కలుగును. అదే శ్రీ చక్రము.

  ఏ ప్రశ్నలో అయినా  తిరిగి  ఆలోచన పెడితే  ప్రశ్నలోనే సమాధానము  దొరుకుతుంది .
  కనుక ప్రశ్నను కలిగి ఉంటూ ప్రశ్నకు ప్రశ్నగా
నిలువాలి నా మాదిరిగా. 
  పుట్టుక అనేది కారణము అయితే మరణము అనేది లాజిక్ అవుతుంది.
   కారణముకు కారణము అయితే లాజిక్ 
అంటారు. 
 మరణము తరువాత నేను ఏమవు తాను ? అనే ప్రశ్నలో తిరిగి ఆలోచన పెడితే ఏమీ కావు అనే సమాధానము వస్తుంది.
  నేను ఎవరిని? అని ఆత్మపరిశీలన చేసుకుంటే నేను కాదు నీవు అనే సమాధానమును 
చేరుకుంటావు.

Comments

Popular posts from this blog

Future is bright for all.