Eevaram - 21 Married Women in Chennai Remove 'Thali' (17 - 04 - 2015)





   పవిత్రత అనేది తన యొక్క తానుగా తనతో మరియు 

ఇతరులతో భావన కలిగి ఉండేది.

  పవిత్రత అనేది పాపము అనే వ్యతిరేక భావనను హరించివేసే గుణము(తిరకాసు హృదయము) కలిగి ఉండేది.

------------------------------------------------

    పవిత్రత అనేది దేనికి పడితే దానికి ఆపాదిస్తే 

పవిత్రతకు అర్ధము ఉండదు.పవిత్రత అనేది శాస్త్రీయ ప్రశ్నలకు నిలబడగలగాలి. 

 సంప్రదాయము అనేది శాస్త్రీయ ప్రశ్నలకు నిలబడగలిగితే  ప్రజలందరూ నేరము మరియు రోగము లేకుండా ఉండేవారు.అంటే సంప్రదాయము ముసుగులో స్వార్ధ పూరిత మానసికత అనేది ప్రజలను చైతన్యము లేకుండా 

జడత్వము మరియు మత్తులో ఉంచుతోంది.   

     సంప్రదాయము సత్యవంతము అయితేనే నిలుస్తుంది-నిలవాలి-ఎందుకు నిలువదు?

     సంప్రదాయము మరియు కట్టుబాట్లు అనేవి మనిషిని 

మనిషిగా తిరిగి ఉంచలేకపొతే అవి నిలువవు. 

  కుటుంబము అనేది సంప్రదాయము.వివాహము అనేది సంప్రదాయము.బంధుత్వము అనేది సంప్రదాయము.

మరి ఇవి సక్రమతగా పనిచేస్తూ ఉంటే అతి వాదనలు 

మరియు ఆలోచనలేమి ఎలా చోటు చేసుకుంటాయి?     

  సంప్రదాయవాదులారా! పవిత్రత అనేది పవిత్రత కోసము కాదు.పవిత్రత అనేది పాపహరణము మరియు 

పాపరహిత సమాజము(జ్ణానము)  కోసము.

Comments

Popular posts from this blog

Future is bright for all.