ఓ బ్యాంకర్లూ ! రుణ వసూలు అనేది హామీ ఉన్న ఆస్తి జప్తు కాదు. రుణము మంజూరు విషయములో రుణ గ్రహీత మరియు రుణము ఇచ్చే బ్యాంకరు ఇద్దరూ సమానముగా భాధ్యత కలిగి ఉండాలి. రుణము మంజూరు చేసేటప్పుడు బ్యాంకర్లు వడ్డీకి రుణము ఇస్తున్నారు కనుక రుణము సక్రమ-నైతికతతో తృప్తిగా తిరిగి చెల్లించలేని స్థితికి బ్యాంకర్లు కూడా భాధ్యులే. కనుక రుణ వాయిదాల చెల్లింపును బ్యాంకర్ల జీతాల నుండి మినహాయింపు చేయాలి-చేయబడుతుంది-ఎందుకు చేయబడదు? ఎందుకంటే "బ్యాంకర్లకు ప్రభుత్వము పట్ల భాధ్యతారాహిత్యము" మరియు "బ్యాంకులకు కలిగిన లాభాలలో ప్రభుత్వముకు వాటా లేమి" ప్రభుత్వము సహించరాదు-సహించకూడదు-ఎందుకు సహించాలి? రైతుల రుణాల తిరిగి చెల్లింపు విషయములో రైతులకు మరియు ప్రభుత్వము కు కలిగిన భారము లేదా పబ్లిక్ న్యూసెంసు బ్యాంకర్లకు వర్తించాలి కదా. బ్యాంకర్లు భాద్యతా రాహిత్యముతో రాక్షస రూల్సు అమలు చేసి జీతాలు తీసుకోవడము ఇకపై ఉండరాదు-ఉండదు-ఎందుకు ఉండాలి?

ఆంధ్ర ప్రదేశ్ లో గాని మరియు/లేదా ఇండియాలో గాని 
రైతులకు వ్యవసాయము లాభసాటిగా ఉండాలంటే 
రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేముందు 'రైతుల 
మానసిక స్థాయి మరియు వారి మాట(ఆలోచన) నైతిక-సక్రమతగా ఉందా అని సామాజిక మనస్తత్వవేత్తలతో 
పరీక్ష' జరిపించి పరీక్షలో పాస్ అయిన తరువాతనే 
బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలి.
మాట నిలకడ లేని పిచ్చివారైన రైతులకు వారి 
వ్యవసాయ భూమి హామీ మీద రుణాలు మంజూరు చేస్తే 
సక్రమత అనిపించుకుంటుంది కాని నైతికత 
అనిపించుకోదు కదా.తద్వారా బ్యాంకర్ల మరియు రైతుల మానసిక వైఫల్యముకు ప్రభుత్వము కు భారము లేదా 
న్యూసెంసు కలుగుతోంది కదా. ఆలోచించండి.  
రుణము అనేది మానసిక స్థాయి మరియు మాట 
రెండూ నైతికముగా మరియు సక్రమతగా ఉన్నవారికే 
తిరిగి చెల్లించే స్థాయి ఉంటుంది.ఆ మాత్రము ఇంగిత 
జ్ణానము రుణ మంజూరు అధికారులకు లేకపోతే ఎలా ? 

Comments