We are witnessing character(feeling) less politics by every section of people now.

ప్రతి మనిషి తన వ్యక్తీకరణ లో తన ఆలోచనలు ,భావములు మరియు ప్రవర్తన లు మూడూ ఉంటాయి . మనము మూసకట్టు మర మనుషులు లాగా ఒకే విధముగా ఉండలేము కదా . అలా ఉంటే జడత్వము వస్తుంది . చైతన్యము ఉండాలి కదా . ఆ వ్యక్తీకరణ లో మార్పును రాజనీతి అంటారు . రాజనీతి కి పాలనా వ్యవస్థలు మరియు సామాజిక ఆర్ధిక వ్యవస్థలు అనేవి రెండు కొమ్మలు . కనుక రాజకీయాలలో ఏ రోజు అయినా ఏదైనా జరుగ వచ్చు . దానికి ప్రతి ఒక్క పౌ రుడు సంసిద్ధ ముగా ఉండి స్వాగతించ డము చేయవలసిన విధి . అదే పరిపక్వ సమాజము .
         అలా కాకుండా అయిదేళ్ళకు వోట్ వేశా ము కదా . ముఖ్యమంత్రి /మంత్రి మార్చకూడదు అని MLA లు అని అనుకుంటే అంతకు మించిన స్వార్ధము ఉండదు . ముఖ్య మంత్రి /మంత్రి అంటే తల మాత్రమే . తల ను శరీరము అనలేము కదా . రాజకీయాలు శరీరము నకు సంబంధించిన విషయము . కేవలము తలకు సంబంధించిన విషయము కాదు అని ప్రతి పౌ రుడు గ్రహిస్తేనే ప్రజాస్వామ్యము ప్రతి రోజు వర్ధిల్లు తుంది . అలా కాకుండా అయిదేళ్ళ పాటు ప్రజలు బానిసలు లాగా ముఖ్య మంత్రి /మంత్రి క్రింద పడి బ్రతక నక్కర లేదు .
      రాజకీయాలు ప్రజల సంక్షేమము కోసము . రాజకీయాలు ఎన్నికల్లో గెలుపు కోసము కాదు . రాజకీయాలు అయిదేళ్ళ బానిసత్వము కాదు . అయితే రాజకీయాలకు ఫీలింగ్ (శీలము )ముఖ్యము . ఫీలింగ్ లేకుండా ఏ నలుగురు రాజకీయాలు మాట లాడినా అది సామాజిక నేరము .
      కనుక నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క పౌ రుడు తనదైన ఫీలింగ్ ను కలిగి వుండి రాజకీయాలు మాట లాడాలి . అంతే కాని తనను మరియు /లేదా తన రంగమును విడిచి తన రాజకీయ ము చేయరాదు .

Comments