Double-standards are proved more with indian opposition parties collectively in both state elections and central govt elections..

అవును ! డి.రాజా(సిపిఐ)! సిపిఐ రజాకార్లకు వ్యతిరేకముగా తెలంగాణా లో పోరాడింది .మరి తెలంగాణా రాష్ట్రమును ఏర్పాటు చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ ను ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో ?
---------------------------------------------------------------
సమాజములో ద్వంద్వ వైఖరి తిష్ట వేసుకొని ఉన్నప్పుడు దానిని తనను తాను పెకలించి వేసుకునే ప్రస్తుత సమయము వచ్చే దాకా భారత జాతీయ కాంగ్రెస్ తక్కువ ద్వంద్వ వైఖరి ప్రదర్సిస్తూ ప్రతి పక్షాలను ఎక్కువ ద్వంద్వ వైఖరి ప్రదర్శించే విధముగా చేయటమే రాజకీయ చతురత .
అంతే గాని రాజకీయములలో వ్యాపార పక్షాల మాదిరిగా ఓడిపోవడము గాని లేదా అనైతిక -విప్లవ పార్టీల మాదిరిగా సమాజమునకు దూరముగా అడవుల్లో జీవించడము గాని రాజకీయ విజ్ఞత అనిపించుకోదు .
రాజకీయ పక్షము అంటే ఎటువంటి హీన పరిస్థితులలో నైనా ప్రజల మధ్య వుండాలి . గెలవాలి . 
అంతే గాని ప్రజలు హీనులు కనుక మేము అడవుల్లో జీవిస్తూ స్లోగన్ లు ఇస్తాము అంటే ఎవరు ఏ వర్గమునకు స్లోగన్ లు ఇస్తున్నట్లు ఇతరులకు తెలియాలి కదా !
లేదా ప్రజలు హీనులు కనుక మా వ్యాపార పార్టీ మడి కట్టుకుని సిద్ధాంతమును నమ్మి సమాజములో వుంటుంది అంటే సిద్ధాంతమును ప్రజలు నమ్మకుండా వ్యాపార పార్టీ లు నమ్మితే సక్రమము అనిపించుకుంటుందా?
సిద్ధాంతము నమ్ముకుని లేదా అమ్ముకుని సమాజములో జీవించడము సక్రమము కాదు. 
సిద్ధాంతమును తనకు కలిగించుకుని ఇతరులకు కలిగించడము సక్రమము అనిపించుకుంటుంది . 
          
రాజనీతి అంటే వేయి మంది ని ఆధారముగా చేసికొని ఇరవై మంది తో శీలము -నైతికత ను నిలబెట్టు కొనుట . 

రాజకీయ వాది అంటే కేవలము ఎన్నికల ప్రచార సమయములో మాత్రమే ప్రజల మధ్యకు వస్తాడు . మిగతా సమయములో చట్ట సభల కార్యక్రమములపై 24*7 పని చేస్తాడు .         
ప్రజలు పరోక్షముగా అధికార పార్టీ మీద జోకులు వేసుకుంటారు . సామాజిక పరిపక్వ ప్రజాస్వామ్యములో తాము మెజారిటీ వోట్ ఇచ్చిన అధికార పార్టీ మీద "పరోక్షములో" జోకులు వేసుకునే స్వేచ్చ ప్రజలకు లేదా ?

ద్వంద్వ వైఖరి ప్రతి పక్షాల లోనే ఎక్కువ వున్నట్లు(ప్రతి పక్షాల వెనుక వైపు వున్న నలుపు ప్రతిపక్షాలు పూర్తిగా తెలుసుకోలేరు కనుక ) ప్రజలకు తేటతెల్లమయ్యే విధముగా అధికారములో వున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ చతురత -విజ్ఞత -నిర్వహణ ప్రదర్శన చేసింది -చేస్తున్నది -చేస్తుంది . అంతే . 
   
  

Comments