LIFE IS THREE DIMENSIONAL IN FOURTH ORDER SOCIAL-SYSTEM.

ఉదాహరణకు  మద్యపానము విషయము సామాజిక  వ్యవస్థలో పెద్ద విషయమా ?
రెండో ఆలోచనలు చేస్తే మద్యపానము నిషేధము విధించవలసిన అవసరము -భాద్యత ప్రభుత్వమునకు ఉన్నదని తేలిందా ?
అలా తేలితే ప్రజలు మానసిక దుర్బలులు అని ప్రభుత్వము భావిస్తున్నట్లు కాదా ?
2. సరే . ఛాందస వాదులు డిమాండ్ చేస్తున్నట్లుగా మద్యపాన నిషేధము ప్రభుత్వము అమలు చేస్తే మరియొక డిమాండ్ ,దాని ఇంకొక డిమాండ్ మరి దాని ఇంకొక ఇంకొక డిమాండ్ పుడతాయా లేదా అని ఛాందస వాదులు ఆలోచన చేయాలి . 
3. బలవంతపు నిషేధము వలన సామాజిక మనస్తత్వము (అనగా ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు )(పోలీస్ మనస్తత్వము ) అభివృద్ధి చెంది నైతికత ఉన్న సగము కూడా ప్రజల లో మటుమాయమవుతుంది . 
4. దానికి బదులుగా మన భారతీయ ప్రజల విధి ఆధ్యాత్మిక హృదయము (ఆలోచన ) వృద్ది చేసుకునే విధముగా ప్రజలకు ప్రోత్సాహకాలు అమలు చేస్తే మద్యపాన నిషేధము అమలు ఆలోచన అవసరము లేదు . 
5. మద్యపాన నిషేధము అమలు జరిపితే ప్రజల మనసులలో మద్యపానము ఆలోచన పోతుందని భావన శాస్త్రీయ మైనధా ? వ్యక్తిగత మనస్తత్వ వేత్తలు మరియు సామాజిక మనస్తత్వ వేత్తలు కలిసి కూర్చుని చర్చలు చేయాలి .
మానవ జీవితము ఒడి దుడుకుల మయము . దానికి మరపు అనే ఔషధము అవసరము . అయితే దానికి ఒక పెగ్ వరకు నియంత్రణ వహించాలి . దానిని గురించి త్రాగు బోతులతో చర్చ చేయాలి . 
6. జీవితము మాటలు -ఊహ కాదు . జీవితము అనుభవము . సమాజము బహుజనులతో నిండినది . మరి అటువంటప్పుడు జీవితము -సమాజము అనుసంధానము మద్యపాన నిషేధముతో పరిష్కారము కాదు .           

Comments